ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో శనివారం ఉదయం రూ.కోటి రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ శాసన మండల చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, వైయస్సార్ శాసన మండల సభ్యులు, వంకా రవీంద్రనాథ్ ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, చెరుకువాడ శ్రీ రంగనాథ రాజులు కలిసి శంకుస్థాపన చేశారు. ఆచంట పంచాయతీ పరిధి పెదపేట కు సంబంధించి రూ.20 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో నిర్మించనున్న కాపు కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. రూ.13 లక్షలతో కాపు, శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో ఉప్పరి కులస్తులకు కమ్యూనిటీ హాలు, ఎస్సీ మాదిగ కులస్తులకు రూ.12 లక్షలు, విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ కు రూ.10 లక్షలు, వెన్నపువారిపాలెం ఎస్సీ కమ్యూనిటీ హాలుకు, రూ.5 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ ... జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిల్లే లావణ్య, సర్పంచ్ కోట సరోజినీ వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ కులాలకు చెందిన సంఘ నాయకులు, వైఎస్‌ఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










