Jul 21,2023 12:42

ప్రజాశక్తి-ఆచంట ( పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్‌ఏల ఆందోళన కార్యక్రమం రెండవ రోజు శుక్రవారం కొనసాగుతుంది. కనీస వేతనం రూ 26, వేలు, ఇవ్వాలని, పే స్కేలు, డి ఎ తో కూడిన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు వీరికి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షులు తలుపురి ముత్యాలరావు మాట్లాడుతూ ... వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించాలని నామినీ గా పనిచేస్తున్నవారిని వీఆర్‌ఏలుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించుకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, నాయకులు సిర్రా నరసింహమూర్తి, ఎస్‌ వి ఎన్‌ శర్మ, పి.మోహన్‌ రావు, వద్దిపర్తి శ్రీనివాస్‌, వీఆర్‌ఏలు సాయిరాం, ముత్యాలరావు, సత్యనారాయణ, భుజింగరావు, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.