ప్రజాశక్తి - ఉండ్రాజవరం: బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణం కోసం మోర్త గ్రామంలో స్థలం కేటాయించి, సహకరించిన పిఎసిఎస్ అధ్యక్షులు ఆలపాటి నరేంద్ర ప్రసాద్ కు మోర్త బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గురువారం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనాన్ని సంఘ అధ్యక్షులు వీరవల్లి వెంకట సుబ్బారావు, లక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 250 మంది సభ్యులు గల తమ సంఘానికి గ్రామ పంచాయతీకి చెందిన ఆరు సెంట్లు స్థలమును కేటాయించిన పంచాయతీ సర్పంచ్ చిటికెన సుజని, ఉప సర్పంచ్ దాపర్తి సందీప్, పంచాయతీ బోర్డు మెంబర్లకు ఈ సందర్భంగా సంఘ సభ్యులు కఅతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తణుకు నాయకులు కామన మునిస్వామి, తూరు గోపు వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నిమ్మన వెంకట శ్రీనివాస్, సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉచ్చింతల ఉప్పలాచారి, సెక్రటరీ అమ్మిన ప్రకాష్, జాయింట్ సెక్రెటరీ షేక్ వలీ, కోశాధికారి చప్పిడి హనుమంతరావు, అయిసెట్టి విజయరాజు , పినిశెట్టి ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.










