Feb 23,2023 13:12

ప్రజాశక్తి-గోపాలపురం (తూర్పుగోదావరి) : కొయ్యలగూడెం ప్రజాశక్తి విలేఖరి తప్పెట్ల శ్రీనివాస్‌కు యాక్సిడెంట్‌ ఇటివల జరిగింది. దీంతో ఆయన మంచానికే పరిమితం కావడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ప్రెస్‌ క్లబ్‌ వారు రూ.10వేలు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షా కార్యదర్శులు అనిల్‌, రామిరెడ్డి, హరి, జె.రత్న కిషోర్‌, కృపారావు, మాణిక్యాలరావు, రామారావు, గాబ్రియల్‌, కొయ్యలగూడెం విలేకరులు పాల్గొన్నారు.