Jul 29,2023 12:28

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : కర్షక- కార్మిక రాష్ట్రసదస్సును జయప్రదం చేయాలంటూ ... సంయుక్త కిసాన్‌ మోర్చ, కేంద్ర ట్రేడ్‌ యూనియన్ల సంయుక్త పిలుపులో భాగంగా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సదస్సు జరుగుతుంది అని తూర్పు గోదావరి జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం వద్ద శనివారం పోస్టల్‌ ఆవిష్కరణ జరిగింది. రైతు సంఘం నాయకులు రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్‌ గారపాటి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ... రైతు రంగానికి హాని కలిగించే 3 నల్ల రైతు చట్టాలను రద్దు చేయాలన్నారు. విద్యుత్తు సంస్కరణ బిల్‌ 2020 ని రద్దు చేయాలని, పంటలన్నింటికి డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చెప్పిన విధంగా సమగ్ర ఉత్పత్తి వ్యయానికి చట్టబద్ద ఎమ్‌.ఎస్‌.పి నిర్ణయించబడాలని, పంట రుణాలను మాఫి చేయలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఉండవల్లి కఅష్ణారావు, రైతు సంఘం నాయకులు కంకటాల.బుద్దుడు, ఆచంట సుభాష్‌ చంద్రబోస్‌, పిన్నమనేని.సత్యనారాయణ, సీనియర్‌ సిపిఎంహొ కామ్‌ శెట్టి.దుర్గరావు, తదితరులు పాల్గొన్నారు.