ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : విద్య అసమానతలు దూరం చేస్తుందని, కష్టాలలో కంగిపోరాదని, పేదరికం చదువుకు ఆటంకం కారాదని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. తన తండ్రి గొల్లపల్లి మూలయ్య 12వ వర్ధంతి సందర్భంగా కడియం బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పరిక్షా కిట్లు, నిత్యవసర సామాగ్రిని అందజేశారు. అలాగే చదువుతో పాటు క్రీడల్లో కూడా చక్కగా రాణిస్తున్న పదో తరగతి విద్యార్థినీ శిరీషకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి వీర సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా సిద్ధపడాలో తెలియజేశారు. హాస్టల్ వార్డెన్ పడాల సుదర్శన, ఆయమ్మలు, కుటుంబ సభ్యులు విజరు భాస్కర్, సిరి, పి.డి.యం. డేవిడ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










