ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపల్లి పిహెచ్‌సిలోని వైద్య సిబ్బందిచే ఫిట్ ఇండియా ప్రత్ఞి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోఎమ్ పిహెచ్‌ఈఓ వై.ఎస్.రాయుడు పాల్గోని ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం వారి చేతులలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెరికఅప ఎం ఎల్ హెచ్ పి శ్రావ్య హెచ్.వి.అరుణమ్మ, హెల్త్ అసిస్టెంట్లు మట్టా శ్రీను, పవన్‌లు పాల్గొన్నారు.










