ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : కడియం మండలం దుళ్ల గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య తల్లి కొండపల్లి వీరాయమ్మ (93) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడవ కుమారుడు పట్టియ్య దుళ్ల సర్పంచిగా వున్నారు. గ్రామంలో అత్యంత సుపరిచితురాలైన వీరాయమ్మ మృతదేహాన్ని అధిక సంఖ్యలో గ్రామస్తులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈమె భర్త మల్లిఖార్జునరావు గతంలోనే మృతి చెందారు. రాజమండ్రి వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ వీరాయమ్మ పార్ధీవదేహానికి పూలు చల్లి నివాళులు అర్పించారు.










