పాలకాల్లు (పశ్చిమ గోదావరి) : ప్రపంచపటంలో కీర్తిని నిలిపిన కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 6 వ వర్ధంతి సందర్భంగా ... పాలకొల్లులోని దాసరి కాంస్య విగ్రహానికి ఆయన అభిమానులు మంగళవారం పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. సినీ వినీలాకాశంలో దాసరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పలువురు కొనియాడారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించడమే కాకుండా ఆయన శిష్యులు కూడా గిన్నీస్ బుక్ లో రికార్డ్ సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వంగా నరసింహరావు, మేడికొండ శ్రీనివాస్, యర్రంశెట్టి వెంకట రత్నం, బోనం మునసబు, విటాకుల వెంకట రమణ, చవాకుల నరేష్ బాబు పాల్గొని దాసరి వారి సేవలను కొనియాడారు.










