- మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి పి నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఇదే కేసులో నారా లోకేష్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో నారాయణ కూడా హాజరు కావాలంటూ సోమవారం నోటీసులను వాట్సాప్ ద్వారా పంపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబును ఎ1గా, నారాయణను ఎ2గా సిఐడి కేసు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్‌లో వుండగా, నారాయణ బెయిల్‌పై బయట వున్నారు. ఈ కేసులో నారాయణను, నారా లోకేష్‌ను ఇద్దరినీ కలిపి విచారించే పరిస్థితి కనిపిస్తోంది.










