Apr 01,2023 13:01

ప్రజాశక్తి కడియం(తూర్పుగోదావరి) : కడియం నర్సరీల్లో మరోరకం (డాల్ఫిన్‌ ఆకారం) లో మామిడికాయలు కనువిందు చేస్తున్నాయి. అంటుకట్టుట ద్వారా కొత్త పండ్ల రకాలు, పూలమొక్కలు తయారు చేసే బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు, ఈ మామిడి మొక్కలను అందుబాటులోనికి తెచ్చారు. చిలుక ముక్కు మామిడిగా పిలువబడే ఈ రకం పూర్తిగా అంతరించి పోతున్న తరుణంలో మరలా అంటుకట్టి జీవంపోసిన రైతు దుర్గారావుని పలువురు అభినందిస్తున్నారు. మామిడి రకాలకు పెద్దగా శాస్త్రీయ నామాలు ఏమివుండవని, పూర్వం నుండి ఏ ప్రాంతంలో పండితే ఆ ప్రాంతం పేరు, లేదా ఊరుపేరు అలాగే ఎవరి పెరట్లో లేక పొలంలో పండితే వారి యొక్క ఇంటి పేర్లతో, పిలువబడే సాంప్రదాయం కొనసాగుతుందని స్థానిక రైతులు అంటున్నారు.