ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : విడపనకల్ మండల పరిధిలోని పాల్తూరు గ్రామం రైతు భరోసా కేంద్రంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే వేరుశనగ విత్తన పంపిణీని మంగళవారం విడపనకల్ ఎంపీపీ కరణం పుష్పావతి భీమ్ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేరుశనగ అవసరమైన రైతులు ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే వారికి సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 40 శాతం సబ్సిడీ పోను 30 కేజీల బస్తాకు రూ.1674 రూపాయలు రైతులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యులా రాణి రాజశేఖర్,వైఎస్‌ఆర్సిపి నాయకులు కరణం భీమిరెడ్డి, పాల్తూరు వైసిపి నాయకులు ప్యాపిలి నాగరాజు, డిష్ వెంకటేష్, రాజశేఖర్, దాసరి వెంకటేష్, షణ్ముఖ గౌడ్, మాలింగ, సుంకన్న, మర్రిస్వామి, గ్రామ వ్యవసాయ సహాయకులు మెర్సీ, సౌందర్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










