Aug 09,2023 16:02

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : పెరవలి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 40 మంది గర్భిణీలకు దాత శిరిగినీడి శేషగిరిరావు ఆర్ధిక సహకారంతో బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తేజశ్రీ హేమరాజు, లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కోలా సీతారాముడు, సలాది ఉదయ భాస్కరరావు, తోట సురేష్‌, బూరుగుపల్లి రాజు, భాస్కర శివకుమార్‌, బాల సుబ్రహ్మణ్యం గ్రామస్తులు గర్భిణీ స్త్రీలు గ్రామస్తులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.