Sep 02,2023 16:16

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి) : ముక్కామల గ్రామంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్‌ను కట్‌ చేసి స్కూలు విద్యార్థులకు కేకు చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. పవన్‌ పుట్టినరోజు కానుకగా నిరుపేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు రేలంగి రాజేష్‌, ఓదూరి నరసింహస్వామి, గండేపల్లి ముసలయ్య, మారిశెట్టి దుర్గారావు, కొత్తపల్లి సత్యనారాయణ, జాలాది నాగరాజు, బండారు ప్రసాద్‌, తాడి పవన్‌, కనికినీడి ప్రసాద్‌, ముత్యాల సర్వారాయుడు, గండేపల్లి గిరి, కన్నాజి శ్రీను, మారిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.