ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ను గోకవరం వైసిపి సీనియర్ నాయకులు సుంకర వీరబాబు మాట్లాడుతూ.. ప్రముఖ ధార్మిక వేత్త కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సాయంతో ఆసుపత్రిలోని సుమారు 100 మంది రోగులకు, గర్భిణీలకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివద్ధి కమిటీ డైరెక్టర్ కర్రీ సురారెడ్డి మండల బిజెపి కార్యదర్శి ఇనకోటి బాపన్న దొర, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.










