ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : పేద ప్రజల ఆరోగ్యం కోసం వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రముఖ న్యూరో వైద్యులు గుడ్ల సతీష్ అన్నారు. ఆదివారం మండలంలోని మోర్తలో గ్రామానికి చెందిన ఆర్.ఎం.పీ చిటకన రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తాడిపర్రు, మోర్త, వెలగదుర్రు, తదితర గ్రామాల ప్రజలు ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో మోర్త సర్పంచ్ చిటకన సుజిని, తాడిపర్రు సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, మాజీ సర్పంచ్ మట్టా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










