Feb 14,2023 14:59

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఉగాదికి 850 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వరరావు తెలిపారు. వేమగిరిలో లే-ఔట్‌ను మంగళవారం పరిశీలించిన చందన పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల్లో నూరు శాతం నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని జగనన్న లే-అవుట్‌కు కేటాయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ల తప్పిదం వల్ల లబ్ధిదారులకు స్థలాల పంపిణీలో జాప్యం జరిగిందన్నారు. 850 మంది కుటుంబాలకు జగనన్న లేఔట్‌-3 సిద్ధమవుతుందని తెలిపారు. ఇక్కడి సమస్యను తాను స్వయంగా జిల్లా కలెక్టర్‌ మాధవిలత దృష్టికి తీసుకెళ్లగా, ఆమె స్వయంగా ఈ లే-అవుట్‌ను పర్యవేక్షిస్తున్నారని, ఉగాదికి లబ్ధిదారులకు స్థలాలు అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్‌ సుజాత, వైసిపి నాయకులు డాక్టర్‌ వెలుగుబంటి వెంకటాచలం, బత్తుల రాము, బడుగు ప్రశాంత్‌ కుమార్‌, సూరపరెడ్డి జానకిరామ్‌, ఎడ్ల రాజా రమేష్‌, ప్రతిపన్‌ కుమార్‌ కట్టా జమిందార్‌, బయ్యవరపు నాగేశ్వరరావు, శీలి జాన్‌, నల్లా ప్రసన్న కుమార్‌, గ్రామ కార్యదర్శి రాజశేఖర్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.