ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : పేదలకు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో రంజాన్ తోఫా పంపిణీ చేయడం అభినందనీయమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 11వ డివిజన్‌లో గురువారం షేక్ నిజాం, సామాజిక కార్యకర్త జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫాను మేయర్ వసీం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో తనకు ఉన్నదానిలో పేద ముస్లింలకు సాయం అందించాలన్న సంకల్పంతో రంజాన్ తోఫా అందించడం గొప్ప కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫక్రుద్దీన్, సామాజిక సేవకుడు జాకీర్ హుస్సేన్ ,మైనార్టీ మత పెద్దలు ఖాజీ జాకీర్ హుస్సేన్, నిజాం, మసూద్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.










