Apr 22,2023 14:31

హైదరాబాద్‌ : రంజాన్‌ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర హౌంమంత్రి మహముద్‌ అలీ ఇంటికి సీఎం కేసీఆర్‌ వెళ్లారు. హౌం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌంమంత్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్‌ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.