అంతర్జాతీయ వీల్ చైర్ 20-20 క్రికెట్ టోర్నీకి ధవలేశ్వరం దివ్యాంగ యువకుడు ఎంపిక
ప్రజాశక్తి- ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : ధవలేశ్వరానికి చెందిన మానుపాటి .ప్రవీణ్ కుమార్ ఈ నెల 9, 10, 11 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జరగబోవు ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగు వీల్ చైర్ 20-20 క్రికెట్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మానిపాటి.ప్రవీణ్ ఒక్కడే ఎంపికయ్యారు. ఇండియా తరఫున ఆడే అవకాశం ధవలేశ్వరానికి చెందిన ప్రవీణ్ ను వరించింది. ప్రవీణ్ కాతేరు పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ కి సెలెక్ట్ కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తోటి సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.










