Aug 16,2023 14:59

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి) : మండలంలోని అన్నవార్పడు గ్రామంలో ఉన్న దళితులకు జగనన్న ఇంటి స్థలాలు ఇవ్వటంలో నాయకులు చిన్న చూపు చూశారని గ్రామానికి చెందిన దళితులు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ బహుజన సమాజ్వాది పార్టీ, జనసేన పార్టీ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం శాంతియుత ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ టి.రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో 180 మందికి ఇంటి స్థలాలు మంజూరు కాగా దళితులు బడుగు బలహీన వర్గాలకు 29 ఇంటి స్థలాలు మాత్రమే అధికారులు నాయకులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దళితులకు ఇంటి స్థలాలు స్మశాన వాటిక సమీపంలో ఇచ్చారని.. అగ్రవర్ణాలకు జాతీయ రహదారి పక్కన స్థలాలు ఇచ్చి దళితులను చిన్నచూపు చూశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.