Feb 14,2023 15:10

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి): ఆయుష్మాన్‌ భారత్‌ సైక్లింగ్‌ ఫర్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం సైక్లింగ్‌ ర్యాలీ నిర్వహించారు. కానూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వైసిపి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హేమరాజు మాట్లాడుతూ.. సైక్లింగ్‌ చేయటం వలన ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ తేజశ్రీ, కె.హేమరాజు, గ్రామ సర్పంచులు భావన,మధు, పూర్ణచంద్‌, బీర సత్యవేణి రాజు, వైసిపి మండల ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి రాము, గ్రామ అధ్యక్షులు కరుటూరి గోపి తదితరులు పాల్గొన్నారు.