కంచిసముద్రం (అనంతపురం) : కంచిసముద్రంలోని చర్ల ఉపాధి కూలీలతో ఈనెల 22న జరుగు కలెక్టరేట్ ముట్టడికి ఉపాధి కూలీలు తరలిరావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిలుపునిచ్చారు. శుక్రవారం నేత మాట్లాడుతూ ... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలి వాళ్లకు కేటాయిస్తున్న వేసవి స్పెషల్ అలవెన్సులు, గడ్డపారల అలవెన్సును పనిచేస్తున్న ప్రదేశంలో మజ్జిగ, నీడ ఆయా తదితర విషయాలన్నీ రద్దు చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో రోజుకు రూ.250 నుంచి 300 రూపాయలు పడే కూలీ ప్రస్తుతం నూరు నుంచి 150 రూపాయలు రోజుకు పడుతుంది కాబట్టి వ్యవసాయ కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున ఈనెల 22 జరుగు కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నారాయణ, లోచర్ల కంచి సముద్రం కూలీలు పాల్గొన్నారు.










