ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులకు నిరసనగా ... ఆదివారం ఉదయం ధవలేశ్వరంలోని స్థానిక ఎన్.ఎమ్.ఈ లూధరన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులంతా ర్యాలీ నిర్వహించారు. ఎన్.ఎం.ఈ లూధరన్ చర్చ్ నుండి ధవలేశ్వరం బ్యారేజ్ వరకు ర్యాలీగా వెళ్లారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. పాస్టర్ రెవరెండ్ అనిల్ కిరణ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










