ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : కడియం మండలం కడియపులంక 216వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇరువురు ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను 108లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి హైవే పెట్రోలింగ్ సిబ్బంది చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.










