Jun 01,2023 15:50

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి): తాడిపర్రు గ్రామానికి చెందిన చిన్నారులు కత్తుల శరణ్య, నిహితల పుట్టినరోజు వేడుక గురువారం గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు రవిబాబు, జ్యోతి రత్నంలు మాట్లాడుతూ.. పొలాల మధ్య కూలీలతో తమ చిన్నారుల జన్మదినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవడం తమకెంతో ఆనందాన్నిచ్చిందంటున్నారు. పొలాలలో పంట బోదె పూడికతీత పనులు చేస్తున్న వారి మధ్య కేక్‌ కట్‌ చేసి, వారికి స్వీట్లు , మజ్జిగ పంపిణీ చేశారు. చిన్నారులను ఉపాధి కార్మికులు హ్యాపీ బర్త్‌ డే అంటూ ఆశీర్వదించారు.