ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం వేమగిరి 216వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మహానాడు వేదిక వద్ద శుక్రవారం భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ... మహానాడు నిర్వహణకు టిడిపి సీనియర్ నాయకులు సభ్యులుగా 200 మందితో కూడిన 16 కమిటీలను నియమించామన్నారు. మహానాడు జరిగే అన్ని రోజుల్లోనూ 15 లక్షల మంది ప్రజలు, పార్టీ నాయకులు వచ్చే విధంగా సభా వేదికను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. భూమి పూజలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, రెడ్డి సుబ్రమణ్యం, కేఎస్ జవహర్, జ్యోతుల నవీన్, గన్ని కఅష్ణ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.










