చిత్తూరు : ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజక వర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ అనంతరం కౌంటింగ్ సెంటర్ అయిన ఎస్ వి సెట్ (ఆర్ వి ఎస్) కాలేజ్ కు కట్టుదిట్టమైన బందోబస్తుతో నగిరి, కుప్పం, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె డివిజన్‌లకు సంబంధించిన సీల్ చేసిన బ్యాలెట్ బాక్స్ లు చేరుకున్నాయి. ఆర్ వి ఎస్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్స్‌కు మొదట తరలించిన బ్యాలెట్ బాక్స్‌లతోపాటు పోలింగ్ స్టేషన్స్ వారీగా చెక్ లిస్ట్ మేరకు పిఓ డైరీ, బ్యాలెట్ పేపర్స్ అకౌంట్స్, పేపర్ సీల్, తదితర అంశాలను పరిశీలించిన అధికారులు వాటిని అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఎ ఆర్ ఓ, డి ఆర్ ఓ ఎన్.రాజ శేఖర్ తోపాటు జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, డ్వామా పీడీ గంగా భవాని, డి పి ఓ లక్ష్మీ, ఆర్‌డిఓ లు సుజన, శివయ్య, రేణుకా, మురళి, కలెక్టరేట్ ఎఓ కుల శేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు శ్రీలేఖ, కిరణ్మయి, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










