ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : జిల్లాల విభజన నేపథ్యంలో కాకినాడ నుంచి అమలాపురం జిల్లాకు ఈవీఎం గోడౌన్ నుంచి 50 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్ బాక్స్‌ను ఆర్డిఓ ఎంబీబీఎస్ సత్యనారాయణ, తహసిల్దార్ సీతాపతి, ఇతర పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం అమలాపురంకు తరలించారు. జిల్లాల విభజన నేపథ్యంలో... అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లాలకు వీటిని తరలించే బాధ్యత ఉందని, శనివారం అమలాపురం ముందుగా తరలించడం జరుగుతుందని ఆర్డిఓ సత్యనారాయణ తెలిపారు. పార్టీ నాయకుల సమక్షంలోనే ఈవీఎం గోడౌన్‌ల తలుపులు తెరవడం జరిగిందని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎలక్షన్ అధికారి, ఆర్డీవో కార్యాలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










