ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం పి.హెచ్.సి.పరిధి కర్రావారిసావరం గ్రామంలో మస్కిటో లార్వా డెన్సిటీ, వెక్టార్ కంట్రోల్ హైజీన్, ఫ్రైడే డ్రైడే పై ఫీడ్ బ్యాక్, డెంగ్యూ వ్యాధి నివారణా అవగాహన వంటి కార్యక్రమాలను బుధవారం క్షేత్ర స్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు అపార్ట్మెంట్ వద్ద గానీ ఉంటున్న ఫ్లవర్ పాట్స్ కూడా మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ అని, వీటి అడుగు భాగంలో రంధ్రాలు ఖచ్చితం గా ఉండాలని సూచించారు. ఇండ్ల ఆవరణలో చిన్న చిన్న నీటి నిల్వలు ఉండడానికి అవకాశం ఉన్న డిస్కార్డెడ్ ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం వీటిలో నీరు నిల్వఉండడం వలన దోమల ఉత్పత్తి అవుతాయని, ప్రజలు ఫ్రైడే డ్రైడే ప్రామాణికంగా పాటిస్తూ దోమ పుట్టుకకు చెక్ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జె.శ్రీనివాస్, గ్రామ సచివాలయ ఆరోగ్య కార్యదర్శి రత్నకుమారి, సబ్ యూనిట్ హెల్త్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాస్, ఆశా కార్యకర్త సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










