Apr 25,2023 15:06

ప్రజాశక్తి-ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) :ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఆర్‌ ఉషాదేవి ఆధ్వర్యంలో మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మలేరియా వ్యాధి గ్రస్తుల నుండీ ఆరోగ్యవంత మైన మానవునికి ఆనఫిలిస్‌ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందన్నారు. దోమల నియంత్రణ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో వున్న 16 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లలో ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించాలన్నారు. రసాయన మందులు పిచికారీ చేయటం వలన, దోమలు నశించి, దోమల వలన సంభవించే రోగాలను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ ఎం.సుబ్రహ్మణ్యం, పిహెచ్‌ఎన్‌, కేడివిఎల్‌ కుమారి, ఎంపి హెచ్‌ఎస్‌, కె.నాగమణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.