Feb 15,2023 15:37

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : శివరాత్రి పర్వదినాన్ని పరిష్కరించుకుని మండలంలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం, పాలంగి గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద శివరాత్రి ఉత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎం.వీ. రామయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్‌ దొడ్డా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగే పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నిడదవోలు ఎమ్మెల్యే జీ.శ్రీనివాస్‌ నాయుడు పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం ఏకాదశ రుద్రాభిషేకములు, కళ్యాణ మహోత్సవం, రాత్రి డోలు సన్నాయి, మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మండల పరిషత్‌ అధ్యక్షురాలు పాలాటి యల్లారీశ్వరీశరత్‌, జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సుబ్బారావు, గ్రామ సర్పంచ్‌ బొక్కా శ్రీనివాసు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వెలిచేటి జానకి రామయ్య, తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.