ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి) : మండలంలో గోదావరి పరివాహ వరద ప్రభావిత లంక గ్రామాలో గురువారం పశుసంవర్ధక శాఖ నిడదవోలు సహాయక సంచాలకులు డాక్టర్ సి.శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పశుగ్రాస లోటును పరిశీలించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్నా టిఎమ్‌ఆర్ (సంపూర్ణ సమీకృత దాణా)ని ఉపోయోగించుకోవాలని తెలిపారు. పశువులకు గొంతు వాపు టీకాలు, పశువుల హెల్త్ క్యాంపులు నిర్వహించవలసిందిగా సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెరవలి పశువైద్యాధికారి డాక్టర్ చరణ్, ఉండ్రాజవరం పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ వర్మ , వెటర్నరీ సిబ్బంది పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.










