ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : ప్రజలందరూ శాంతి మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు) అన్నారు మంగళవారం మానవత వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా గణపవరం డిగ్రీ కాలేజీ వద్ద నుండి స్థానిక పోలీస్ ఐలాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసు బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి దాని ద్వారా పరిసరాలను పరీక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన శాంతి ర్యాలీలో భాగంగా మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా నాయకులు కాకర్ల వినాయక, వంకాయల రామారావు, పాతపాటి హరికుమార్ రాజు, చేబోలు నాగేశ్వరరావు, తాడేపల్లి మోహన్‌రావు, గమని రాంబాబు, ఆలపాటి నాగేశ్వరరావు, బుద్ధారపు పుల్లయ్య, జలాలని ఇతర మండలాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.










