ప్రజాశక్తి - ధవలేశ్వరం (తూర్పుగోదావరి) : ధవలేశ్వరంలోని కస్తూర్బా గాంధీ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అల్ ఇన్ వన్ పుస్తకాలను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ కోఆర్డినేటర్ చందన. నాగేశ్వర్, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థినీలకు అల్ ఇన్ వన్ పుస్తకాలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుని, మంచి మార్కులు సాధించి మన స్కూల్ కు, మీ తల్లీ దండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ వ్యవస్థ తో ధీటుగా మన చదువులు ఉండాలని, మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చందన కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలిక్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రావి.విజయ దుర్గ, వైసిపి నాయకులు, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, హితకారిణి సమాజం డైరెక్టర్ దేవులపల్లి.సరిత పాల్గొన్నారు.










