Apr 13,2023 17:36

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి) : మండలంలోని అజ్జరం గ్రామంలో గురువారం ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొందరికి ఒక చేతితో ఇస్తూ మరొక చేతితో తీసుకుంటుందన్నారు. అందరి వద్ద నుండి పన్నుల రూపంలో పది రెట్లు అధికంగా దోచుకుంటోందన్నారు. పెరిగిన విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌ నిత్యవసర ధరలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పోతాబత్తుల శ్రీను, మండల అధ్యక్షులు రామ కృష్ణమ్మ ( శ్రీను), రాజమండ్రీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొడ్డు రామాంజనేయులు, పెచ్చెట్టీ శ్రీను, పెనుమత్స సురేష్‌ రాజు, పెనుమత్స గనిరాజు, మరపట్ల రాంబాబు, గంటి శ్రీను, సానబోయిన సత్యనారాయణ, పేచ్చెట్టి సీతామహాలక్ష్మి, అల్లు ఉమామహశ్వరి, నియోజవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.