ప్రజాశక్తి-సీతానగరం(తూర్పుగోదావరి) : ఈ నెల 8వ తేదీన టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజానగరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, చంద్రబాబు టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గౌతమ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతానగరం మండలం బబ్బిల్లంక మీదుగా పురుషోత్తపట్నం ఫేస్ 1 ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని అక్కడ ఎత్తిపోతల పథకం పరిస్థితిని రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులతో పాటు రైతులతో సమీక్షిస్తారని తెలిపారు. అనంతరం పురుషోత్తపట్నం నుండి సీతానగరం మీదుగా కోరుకొండ బస్టాండ్ సెంటర్ చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో ప్రజలనుదేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడ్డు వెంకటరమణ, రాష్ట్ర టిడిపి కార్యదర్శిలు తనకాల నాగేశ్వరరావు, ఎస్వీఎస్ అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కందుల బాబు రాయుడు, రాజానగరం మండల టిడిపి అధ్యక్షులు గంగిశెట్టి చంటిబాబు, జగ్గంపేట, గోకవరం మండలాల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, మంగ రౌతు రామకృష్ణ, రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, ఈది అశోక్, రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి గునిపేభరత్, రాష్ట్ర బీసీ సాధికారత డైరెక్టర్ వంకా మల్లిబాబు, గుండా శివప్రసాద్, సాలాపు నలమహారాజు, ఎస్ బాబు, మింది నరేంద్ర, కోన శివ నాయుడు, నాగం వెంకటపతి తదితరులు పాల్గన్నారు.










