ప్రజాశక్తి -గోకవరం (తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు పంపిణీలో భాగంగా గోకవరంలో 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని వాటికి పట్టాలు ఇవ్వాలని బుధవారం గోకవరంలో కోళ్ల ఫారం ఎంక్వైరీకి వచ్చిన రాజమహేంద్రవరం ఆర్డీవో చైత్ర వర్షినికి వైసిపి నాయకులు, గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి భర్త సుంకర వీరబాబు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు గత లేఅవుట్లో 600మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని అక్కడే మిగిలిన 200 మందిని కలుపుకుని 800మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీవో చైత్ర వర్షిని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు వాటికి పట్టాలు ఇవ్వలేదని ఇప్పటికే చాలాకాలం అయిందని ఇప్పటికైనా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని ఆర్డిఓ చైత్ర వర్షినికి వినతి పత్రం అందజేస్తూ విజ్ఞప్తి చేశారు.










