ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలోని ములగాల రామకష్ణకు చెందిన ఇంట్లో అదే గ్రామానికి చెందిన అల్లే గణేష్, సౌందర్య. దంపతులు అద్దెకు ఉంటున్నారు యధావిధిగా మంగళవారం ఉదయం కూలి పని నిమిత్తం పొలంలోకి వెళ్లారు. మధ్యాహ్న వారు ఇంటికి తిరిగి వచ్చే సమయం, 12 గంటల ప్రాంతంలో వారు నివాసం ఉంటున్న పోర్షన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లోని బట్టలు మంచాలు బీరువాలు ఫ్యాన్లు తదితర వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే ఇళ్ల వద్ద నిలవలు ఊహించిన నీటితో మంటలను ఆర్పారు.










