Aug 05,2023 23:51

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9 నిర్వహించే ధర్నాను విజయవంం చేయాలని కోరుతూ, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్‌ లో గల సిఐటియు కార్యాలయంలో సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు, ఐ.ఎఫ్‌.టి.యు నాయకులు కె.జోజి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై పన్నులభారాలు మోపుతూ, కార్మికులను బానిసలుగా మార్చేందుకు 46 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారని, 3 వ్యవసాయ చట్టాల రూపంలో రైతాంగ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మోడీ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే పార్టీలకు ప్రజలు, కార్మికులు, మేధావులు ఓటుద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9 న క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జరిగే జరిగే ధర్నాకు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.ఎస్‌.మూర్తి, ఎఐటియుసినాయకులు కొండలరావు, సిఐటియూ జిల్లా నాయకులు బి. పవన్‌ పాల్గొన్నారు.