Feb 22,2023 23:48

అన్నదానం చేస్తున్న రాంబాబు, వెంకటేశ్వరావు తదితరులు

500వ రోజుకు అన్నదానం
స్వర్ణాంధ్ర రాంబాబుకు పలువురి అభినందన
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
500 రోజుల పాటు నిర్విరామంగా అన్నార్తుల ఆకలి తీర్చడం అభినందనీయమని లయన్స్‌ పూర్వపు గవర్నర్‌ గ్రంధి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పుష్కర ఘాట్‌లో లయన్స్‌ క్లబ్‌, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రత్న రియాలిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విబి.రాయుడు పాల్గొని మాట్లాడారు. స్వర్ణాంధ్ర రాంబాబు చేస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రాంబాబు రోజుకు సుమారు 500 మందికి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దీనికి నగరంలోని దాతలు, లయన్స్‌ సభ్యులు అందరూ సహకరించాలని అభ్యర్థించారు. ఇప్పటివరకు 1,64,540 మందికి అన్నదానం అందించారన్నారు. 5వేల మంది వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. వారందరికీ రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు న్యాయవాది రంగరాజన్‌, ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ పూర్వపు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ లయన్‌ కొల్లూరి గోపాలకష్ణ, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధి అనూప్‌జైన్‌, జమాతే ఇస్లాం హిందూ రాజమండ్రి శాఖ అధ్యక్షులు హిమైతుద్దీన్‌, అన్సర్‌ అహ్మద్‌, సుబ్రహ్మణ్యం, అమీర్‌, దువ్వాడ రాజా, స్వర్ణాంధ్ర మేనేజర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాంబాబు సత్కరించి జ్ఞాపికలను అందించారు.