ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్ర
నిరుద్యోగ సమస్య పరిష్కారానికై ప్రత్య మ్నాయ విధానాలతో సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేం ద్రవరంలో రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 4న నిర్వహి స్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ వెల్లడిం చారు. స్థానికి సిపిఎం కార్యాలయంలో శనివారం గోడ పత్రికను ఆవిష్కతినిధిరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత యొక్క శక్తి సామర్థ్యాల్ని సక్రమంగా ఉపయోగిం చుకుంటేనే ఏ దేశమైనా అభి వృద్ధి సాధిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక 5 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత పడ్డాయని తెలిపారు. మోడీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే బజ్జీలు, పకోడిలు అమ్ము కోండి అంటూ అమిత్ షా యువతకు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ చెప్పిన మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉద్యోగాలు కల్పించలేదని, నల్లధనం బయటకు రాలేదన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు యువతకు తీరని ద్రోహం చేస్తున్నా యని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ చెప్పిన 2.35 లక్షల ఉద్యోగాలు నాలుగున్నరేళ్ల పాలనలో భర్తీ కాలేదని అన్నారు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి నాలుగేళ్లలో ఒక క్యాలండర్ ఇచ్చి అందులో కూడా ఉద్యోగాలు లేకుండా విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎపిలో యువత పరిస్థితి దారుణంగా ఉందని, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేక మరోవైపు ఉపాధి పరిశ్రమలు రాక యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బతుకు దెరువు భారమై ఆత్మహత్యలు చేసుకోవడం లేదా మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ రాకపోగ ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొ న్నారు. ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వని ఏకైక ప్రభు త్వంగా జగన్ సర్కార్ రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూసే గ్రూప్-2 నోటిఫికేషన్ రాలేదని, ఇప్పుడు ఎన్నికల ముం దు హడావుడిగా ఎపిపిఎస్‌సి గ్రూపు 1, 2 కలిపి 500 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. సుమారు 7 లక్షల మంది నిరుద్యోగులు గ్రూపు-2 కోసం ఎదురుచూస్తుంటే ఖాళీలతో సంబంధం లేకుండా పాలకులు మాట్లాడటం మంచిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9.64 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, మెగా డిఎస్‌సి ప్రకటించి 25 వేల ఉపాధ్యాయ పోస్టులు, పిఈటిలతోకలిపి భర్తీ చేయా లనే డిమాండ్‌తో సిపిఎం అనేక పోరాటాలను సాగిస్తుం దని, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు నిరుద్యో గులను సన్నద్ధం చేసే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 4న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిపిఎం సూత్రబద్ద రాజకీయాలతో యువత యెక్క శక్తి సామర్థ్యాన్ని అభివద్ధిలో భాగస్వా మ్యం చేసేందుకు నూతన ప్రత్యామ్నాయ విధానాలను రూపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేం ద్రవరం సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, జిల్లా నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, బి.రాజులోవ పాల్గొన్నారు.










