ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నగరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆయాలు చేపట్టిన నిరసన బుధవారం నాటికి మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్కూల్స్‌ను విద్యాశాఖకు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందులో పని చేసే పార్ట్ టైం కంటింజెంట్ వర్కర్ల విషయంలో మాత్రం సరియైన గైడ్‌లెన్స్ ఇవ్వకుండా కాలయాపడం చేయడం తగదన్నారు.. మున్సిపల్ శాఖ అధికారులు ఆయాల బాధ్యతను విస్మరించారన్నారు. జీతాలు ఇచ్చి చేతులు దులుపు కున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, కలెక్టర్ ఈ సమస్యపై స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకి పిఇటిల సంఘం జిల్లా నాయకులు రామ్మోహన్ మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు వై.ఝాన్సీ, తాయారు, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు










