Aug 27,2023 22:32

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న అధికారులు

ప్రజాశక్తి - పెరవలి
మండలంలో ఖండవల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న రవళి స్పిన్నర్స్‌ విస్తరణ పనులకు ఈ నెల 31న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారని జెసి తేజ్‌భరత్‌ తెలిపారు. ఆదివారం జెసి తేజ్‌ భరత్‌, ఆర్‌డిఒ మల్లిబాబు, తహశీల్దార్‌ టి.రాజరాజేశ్వరితో కలిసి రవళి స్పిన్నర్స్‌ ఆవరణలోని సిఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేసే స్థలాన్ని, సమావేశ మందిరాన్ని వారు పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రవళి స్పిన్నింగ్‌ మిల్‌ పరిశ్రమ విస్తరణ వలన డైరెక్ట్‌ ఎంప్లారుమెంట్లో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఇన్‌ డైరెక్ట్‌గా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనేది ఆరా తీశారు. వీరి వెంట తహశీల్దార్‌ టి.రాజేశ్వరి, రవళి స్పిన్నర్స్‌ సిబ్బంది బి.రాజశేఖర్‌, గంధం వీరరాఘవులు తదితరులున్నారు.