Jul 20,2023 00:04

ప్రజాశక్తి-తాళ్లపూడి
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 21వ తేదీ నుండి పది రోజులపాటు జరగనున్న ఓటర్ల వివరాల సేకరణ సమయంలో ప్రతి ఒక్కరూ బిఎల్‌ఓ లకు సహకరించాలని తహశీల్దార్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి టి.రాధిక అన్నారు. పది రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమం నిమిత్తం తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం బిఎల్‌ఒలకు నిర్వహించిన సమావేశంలో తహశీల్దార్‌ మాట్లాడుతూ ఈ సర్వేలో ఏ విధమైన వివరాలు సేకరించాలో తెలియజేశారు. ఒకే ఇంటిలో ఉంటున్న భార్యాభర్తల ఓట్లు వేరు వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉంటే వాటిని సరి చేయడం డోర్‌ నెంబర్లు మార్పు, ఆడామగా ఓటర్ల గుర్తింపులో తేడాలు ఉంటే సరి చేయడం తొలగింపులు కొత్త ఓటర్ల నమోదు వంటి విషయాలను బిఎల్వోలు నిర్వహించే సమయంలో ఫిర్యాదులు రాకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. 44 పోలింగ్‌ బూత్‌ లకు సంబంధించిన బిఎల్‌ఒలకు కొత్త జిపిఎస్‌ విధానం అనుసంధానం చేయడం వలన ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి అందరూ ఓటర్లను తప్పనిసరిగా కలుసుకుంటారని అన్నారు. ఇదే సమయంలో కొత్త ఓట్లు ఆన్లైన్‌ ద్వారా నమోదు చేస్తారని అంటూ సంబంధిత వ్యక్తులు తమ వద్ద గల ఆధార్‌ ఇతర గుర్తింపు కార్డులను బిఎల్‌ఒలకు చూపించి నమోదు చేయించుకోవచ్చని తహశీల్దార్‌ తెలిపారు.పెరవలి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం తహశీల్దార్‌ టి .రాజేశ్వరి అధ్యక్షతన మండల రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎలక్షన్‌ ప్రొగ్రాం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల చేర్పులు మార్పులు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు నెల రోజుల ఓటర్ల చేర్పులు మార్పులు గ్రామాల్లో జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోఅధికారులు, వైసిపి, జనసేన టిడిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.