ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
నగరంలోని ద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర రాజమహేంద్రవరనం సిటీలో ఆగస్టు 21 నుంచి 24 వరకు నిర్వహిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్. రాజా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీలో జరుగుతున్న ఈ సైకిల్ యాత్రలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సైకిల్ యాత్ర సిటీ మొత్తం మీదుగా నాలుగు రోజులు పాటు జరుగుతుందన్నారు. ఈ నాలుగు రోజుల్లో ి సిటీ లో ఉన్న ప్రతి విద్యా సంస్థకి ప్రతి హాస్టల్స్ కి ఈ సైకిల్ యాత్ర వెళుతుందని ఆ విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించేంత వరకు ఎస్‌ఎఫ్‌ఐ పోరు విడవదని అన్నారు ఈ సైకిల్ యాత్ర దాదాపు 40 మంది విద్యార్థులతో జరుగుతుందన్నారు. దీనికి విద్యార్థులు, ప్రజలు సహకరించాలని కోరారు ఈ యాత్ర 21న ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ప్రారంభమవుతుందని ఎస్ కే ఆర్ మహిళ కళాశాల వద్ద 24న ముగుస్తందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వై భాస్కర్ జిల్లా కమిటీ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.










