Aug 15,2023 13:17

వీరఘట్టం (మన్యం) : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ... వీరఘట్టంలోని శ్రీ గాయత్రి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 200 మీటర్ల త్రివర్ణ జాతీయ పతాకాన్ని చేతపట్టి విద్యార్థులంతా ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల నుండి ప్రధాన రహదారి మీదుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది.