Mar 01,2023 22:11

ప్రజాశక్తి - ఉండ్రాజవరం మానవత శాఖ ఆర్థిక సహకారంతో వేమగిరి పరమహంస యోగానంద నేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం పాలంగిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 180 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 102 మందికి కళ్ళజోళ్లు అవసరం కాగా ఉచితంగా పంపిణీ చేసినట్టు మానవత ఉండ్రాజవరం శాఖ అధ్యక్షులు ఎన్‌వికె.పాపారావు తెలిపారు. 8 మందికి కంటి ఆపరేషన్‌ అవసరమైనట్లు, నేత్ర సంస్థ సిబ్బందితో ఉచితంగా ఆపరేషన్‌ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. పాలంగి, కె.సావరం, తణుకు, పి.వేమవరం తదితర ప్రాంతాల నుంచి పరీక్షల నిమిత్తం శిబిరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు వి.బోస్‌, అన్నే వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.