ప్రజాశక్తి - కాకినాడ జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు సంబంధించి బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో డిఆర్‌ఒ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో డివిజన్‌కు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుందని,16 నుంచి 23వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ పని దినాలలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో బాజిబోయిన వెంకటెష్ నాయుడు (కాంగ్రెస్), సబ్బారపు అప్పారావు (బిఎస్‌పి), సిజిహెచ్.సత్యనారాయణ (బిజెపి), ఎం.రాజశేఖర్ (సిపిఎం), రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు.










