Oct 14,2023 22:54

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఈ నెల 16వ తేదీ నుంచి బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్‌లను మొదటి తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌తో కలిసి శనివారం ఆయా పరికరా లను భద్రం చేసిన గొడౌన్‌లో భద్రత ఏర్పాట్లును కలెక్టర్‌ పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ వచ్చే ఏడాది నిర్వహించనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణులు ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ అక్టోబర్‌ 16 నుంచి అన్ని యూనిట్స్‌ తనిఖీలు పూర్తి అయ్యే వరకు నిర్వహించడం జరుగుతుం దని అన్నారు. జిల్లాకు చెందిన 5,971 బ్యాలెట్‌ యూనిట్స్‌, 5,463 కంట్రోల్‌ యూనిట్స్‌, వివిపాట్‌ యూనిట్స్‌ 4,927 తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విధుల్లో పాల్గొనే సిబ్బంది అధికారులు ఎవ్వరూ సెల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ తీసుకుని రావద్దన్నారు. అత్యంత భద్రత మధ్య తనిఖీ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క అధికారికి, సిబ్బందికి రాజకీయ పార్టీల ప్రతినిధుల జాబితా గుర్తింపు మేరకు అనుమతిం చడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీ ప్రక్రియ ఉంటుందని తెలి పారు. ఈ ప్రక్రియ సిసి కెమెరాల పర్యవేక్షణలో చేపట్ట డం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, పాల్గొన్నారు.